రైతులకు అన్యాయం జరగకుండా భూసేకరణ బిల్లుకు సవరణ జరిగిందన్నారు టీఆర్ఎస్ ఎంపీలు. రైతులకు న్యాయం జరిగేలా భూసేకరణ బిల్లుకు సవరణలు ప్రతిపాదించినట్టు చెప్పారు. రైతుల అనుమతి, భూమి కోల్పోయినవారికి నష్టపరిహరం, ఉద్యోగ కల్పన, భూమిపై ఆధారపడినవారికి న్యాయం జరిగేలా సవరణలు తెచ్చామన్నారు. భూసేకరణ చట్ట సవరణను రాజకీయ అంశంగా చూడొద్దని.. గుడ్డిగా ఓటు వేయద్దని సీఎం కేసీఆర్ సూచించినట్టు చెప్పారు.




