పాస్టర్లకు వేతనాలు ఇవ్వాలి – టిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంకరి కుమార్

జనంసాక్షి, మంథని : తెలంగాణ రాష్ట్రంలోని హిందూ అర్చకులకు, ముస్లిం ఇమామ్ లకు వేతనాలు ఇస్తున్నట్లు క్రైస్తవ పాస్టర్లకు వేతనాలు ఇవ్వాలని తెలంగాణ క్రిస్టియన్ కౌన్సిల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంకరి కుమార్ బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. మారుమూల ప్రాంతాల్లో చాలీచాలని క్రైస్తవ విశ్వాసుల చందాలతో జీవనం సాగిస్తున్న పాస్టర్ లకు వేతనాలు ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని ఆయన కోరారు. సమాజంలో శాంతి కోసం నిత్యం ప్రార్థనలు చేస్తున్న పాస్టర్ల జీవితాల్లో వెలుగులు నింపాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. చర్చిల నిర్మాణానికి, చర్చి కాంపౌండ్ ల నిర్మాణం, క్రైస్తవ సమాధుల స్థలాల కాంపౌండ్ వాల్ నిర్మాణానికి ప్రభుత్వం వెంటనే నిధులు అందించాలని ఈ సందర్భంగా కోరారు.