Tuesday, 3 November 2026

పిచ్చి పట్టిన కోతి ఊరవెల్లి శ్రావణ్ కుమార్.

 

 

 

 

 

 

 

 

మల్కాజిగిరి.జనంసాక్షి.మే4మల్కాజిగిరి డివిజన్ కార్పొరేటర్ ఊరవెల్లి శ్రావణ్ కుమార్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో పిచ్చి పట్టిన కోతిలా వ్యవహరిస్తూ కౌన్సిల్ సమావేశం జరగకుండా అడ్డుపడ్డాడని మల్కాజిగిరి బిఆర్ఎస్ పార్టీ సర్కిల్ అధ్యక్షుడు పిట్టల శ్రీనివాస్ ఒక ప్రకటన విడుదల చేశారు. పట్టణ ప్రథమ పౌరురాలు ఆడపడుచు అని చూడకుండా కట్టుబొట్టు ఆమె మాట్లాడే విధానాన్ని వక్రీకరిస్తూ పిచ్చి పట్టిన కోతిలా పిచ్చి చేష్టలు చేశారని దీన్ని
మల్కాజిగిరి నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.నియోజకవర్గంలో ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చేసిన అభివృద్ధిని చూసి ఓర్వలేక కార్పొరేటర్ ఆ విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.ఏ సమస్యనైనా మంచి మాటలతో పరిష్కరించాలి తప్ప ఒకరిని వెక్కిరించి ఒకరిని కించపరిచి ఆడబిడ్డల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహారిస్తే కుక్క కాటుకు చెప్పు దెబ్బలాగా సమాధానం చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు