రాజంపేట్ ఏప్రిల్ 21 (జనంసాక్షి) రాజంపేట్ మండలంలోని పరిధిలోని వివిధ గ్రామాలలో వేసవికాలం రావడంతో విద్యార్థులను తల్లిదండ్రులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని రాజంపేట్ ఎస్సై రాజు తెలిపారు పాఠశాలకు కళాశాలకు సెలవులు ప్రారంభం కావడంతో విద్యార్థులు యువకులు ఈత కొరకు వెళ్లే ప్రమాద బారిన పడే అవకాశాలు ఉన్నాయని కావున పిల్లల పట్ల జాగ్రత్త వహించి బావుల దగ్గరికి చెరువులో కుంటలు వాగులో దగ్గరికి వెళ్లకుండా చూడాలని తెలిపారు పిల్లలకి ఇండ్లలోనే తల్లిదండ్రులు విషయాలపై జాగ్రత్త తెలియజేయాలని ఎస్సై రాజు తెలిపారు





