Wednesday, 4 November 2026

శామీర్ పేట్ లో చలి వేంద్రాన్ని ప్రారంభించిన మహేందర్ రెడ్డి

 

 

 

 

:శామీర్ పేట్, జనం సాక్షి :ఎండ కాలంలో పాదచారుల దాహర్తిని తీర్చేందుకు ముందుకు వచ్చి చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు వంగ నర్సింహారెడ్డి ని మేడ్చల్ నియోజవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జీ చామకూర మహేందర్ రెడ్డి అభినందించారు. శామీర్ పేట్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీనాయకులు వంగ నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని చామకూర మహేందర్ రెడ్డి ముఖ్య అతిధిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడు తూ..ఎండ తీవ్రత భాగా ఉందని, ఇలాంటి వాతావరణంలో పాదచారుల సౌకర్యార్ధం మంచినీళ్లు తాగేందుకు వంగ నర్సింహారెడ్డి గత 10 సంవత్సరాల నుండి చలివేంద్రాలను ఏర్పాటు చేయ్యడం అభినందించాల్సిన విషయమన్నారు. ఎండ కాలంలో పాదచారుల దాహర్తి తీర్చేందుకు చవిలేంద్రాలను ఏర్పాటు చేయ్యాలని సూచించారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ నాయకులు వంగ నర్సింహారెడ్డి మాట్లాడుతూ ఎండకాలంలో తమ పనుల నిమిత్తం వచ్చి పోయే పాదయాచారులకు, వాహనా దారులకు తనవంతు సహాయంగా గత 10 సంవత్సరాల నుండి చలివేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఎల్లుబాయి బాబు, శామీర్ పేట్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు విలసాగరం సుదర్శన్, శామీర్ పేట్ గ్రామ ఉప సర్పంచ్ రమేష్ యాదవ్, వార్డు సభ్యులు నవీన్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మైసయ్య, పవన్, నర్సింహారెడ్డి, వంగ వెంకట్ రెడ్డి, సంజీవ రెడ్డి, అఫ్జల్ ఖాన్, సుధాకర్ రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.