భువనగిరిటౌన్ జనం సాక్షియాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఈరోజు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు భువనగిరి పార్లమెంట్ సభ్యుడు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆదేశాలనుసారం దశాబ్ది దగా ఉత్సవాలతో కెసిఆర్ ప్రభుత్వం గత 20 రోజుల నుండి పేద ప్రజలు సొమ్మును బిఆర్ఎస్ పార్టీ ప్రచార వారోత్సవాలుగా జరుపుకోవడాన్ని నిరసిస్తూ భువనగిరి ఆర్డిఓ కార్యాలయం ముందు నిరసన ధర్నా చేసి ఆర్డిఓ కార్యాలయం నుండి తెలంగాణ అమరవీరుల స్థూపం వరకు నిరసన ర్యాలీ చేపట్టి అమరవీరుల స్తూపం ముందు కేసీఆర్ 10 తలల దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఈసందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్ మాట్లాడుతూ అమరుల త్యాగాలతో 1200 మంది విద్యార్థుల బలిదానాలను చూసి చలించిపోయి శ్రీమతి సోనియాగాంధీ గారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే ఆమె ఆకాంక్షకు వ్యతిరేకంగా నీళ్లు నిధులు నియామకాలు పేరుమీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం కేవలం కేసీఆర్ కుటుంబానికి బంగారు తెలంగాణగా మారిపోయి 30% కమిషన్లకు కక్కుర్తి పడి కెసిఆర్ ప్రభుత్వం తెలంగాణ మీగులు బడ్జెట్ గా ఉన్న రాష్ట్రాన్ని ఐదు లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా మార్చిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్ది పూర్తి కాకుండా దశాబ్ది ఉత్సవాల పేరుమీద ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తూ రానున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రజల ధనానితో ప్రభుత్వ అధికారులతో అండదండలతో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వారోత్సవాలుగా చేయడానికి నిరసిస్తూ 10 అంశాలను 10 తలకాయలతో రావణుని తలకాయతో దిష్టిబొమ్మ దహనాన్ని చేసి ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు విజ్ఞులు మోసపోయిన నిరుద్యోగ యువతీ యువకులు సంపండ వర్గాలు ప్రజలు ఉద్యోగులు ఉపాధ్యాయులు కవులు కార్మికులు కర్షకులు జాతుల పేరు మీద మోసం చేస్తున్న కెసిఆర్ నిజస్వరూపాన్ని తెలుసుకొని కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలందరూ కూడా ఆశీర్వదించి సామాన్య తెలంగాణను ఏర్పాటు చేసుకున్న దిశగా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని కోరడం జరిగింది ఈకార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు దర్గాయి హరిప్రసాద్ జిల్లా కాంగ్రెస్ ఓబీసీ సెల్ అధ్యక్షులు గోదా రాహుల్ జిల్లా కాంగ్రెస్ మైనార్టీ విభాగం అధ్యక్షులు షేక్ మదర్ పాష బబ్లు కౌన్సిలర్లు ఈరపాక నరసింహ పడిగెల రేణుక ప్రదీప్ వడపర్తి సర్పంచ్ ఎలిమినేటి కృష్ణారెడ్డి వీరవెల్లి సర్పంచ్ తంగళ్ళపల్లి కల్పన శ్రీనివాస చారి వలిగొండ జడ్పిటిసి వాకిటి పద్మ అనంతరెడ్డి దేవరకొండ నరసింహ చారి మైలారం వెంకటేష్ సిరికొండ శివకుమార్ గుమ్మడిల్లి రమేష్ బాబా అమనత్ యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి పుట్ట గిరీష్ ముత్యాల మనోజ్ యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్ గౌడ్ మండల కాంగ్రెస్ ఓబీసీ అధ్యక్షులు మచ్చ నరసింహ గౌడ్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ కన్వీనర్ దాసరి మధు పట్టణ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు జిట్ట మల్లారెడ్డి పార్వతి మల్లేష్ ఐలాపురం బాబు భూషపాక మల్లేష్ ఓబీసీ కాంగ్రెస్ నాయకులు సీతా అరవింద్ ఐలయ్య పవన్ రాజ్ బూర నరసింహ యాదవ్ శివ సందీప్ గౌడ్ చింటూ హర్షిత్ మళ్లీ వంశీ వల్లపు రమేష్ తదితరులు పాల్గొన్నారు
పిసిసి పిలుపు మేరకు వెంకటరెడ్డి ఆదేశానుసారం దశాబ్ది దగా – పేరుతో కేసిఆర్ నిరంకుశ పాలన కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భువనగిరి ఆర్ డి ఓ కార్యాలయం వద్ద నిరసన ,ధర్నా




