Wednesday, 4 November 2026

అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి..! – ఎంపీపీ రాచకొండ లక్ష్మి

జనంసాక్షి, కమాన్ పూర్ : తెలంగాణ అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని కమాన్ పూర్ ఎంపీపీ రాచకొండ లక్ష్మీ రవి అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో బాగంగా గురువారం మండల ప్రజా పరిషత్ మీటింగ్ హాల్ లో అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించారు. అమరవీరుల స్థూపానికి పూలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ కోసం శ్రీకాంతాచారి పోలీస్ కిష్టయ్య తో పాటు ఎందరో మహానీయులు తమ ప్రాణాలను త్యాగం చేశారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం మృతి చెందిన అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ దాసరి రాజలింగు, ఎంపీడీవో విజయ్ కుమార్, తహసిల్దార్ దత్తు ప్రసాద్, ఎంపీఓ శేషయ్య సూరి, మండల కో ఆప్షన్ ఇంతియాజ్, సర్పంచ్ లు బొల్లపల్లి శంకర్ గౌడ్, ఆకుల ఓదెలు, తాటికొండ శంకర్, తోగరి అన్నపూర్ణ అశోక్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుర్రం లక్ష్మి మల్లు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.