Wednesday, 4 November 2026

పి ఆర్ టి యు ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు

వరంగల్ ఈస్ట్ జూన్ 6 జనం సాక్షివరంగల్ నగరంలోని అండర్ రైల్వే గేట్ రాజశ్రీ గార్డెన్ లో మంగళవారం సాయంత్రం పి ఆర్ టి యు ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో పదో తరగతిలో 10/10 సాధించిన 26 విద్యార్థులతోపాటు మరో 55 మందికి, మండల టాపర్స్ కి ప్రతిభ పురస్కారాల ప్రధానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వరంగల్ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఎంతో ప్రతిభను కనబరిచి ఉన్నత స్థాయికి ఎదుగుతుండడం అభినందనీయమన్నారు. ప్రభుత్వం ప్రభుత్వ విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తుందన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత విద్యావ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని చెప్పారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుతూ ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఎమ్మెల్యే నరేందర్ కోరారు ఈ కార్యక్రమంలో ఖిలా వరంగల్ పిఎసిఎస్ చైర్మన్ కెడల పద్మ జనార్ధన్ కార్పొరేటర్ ముష్కమల్ల అరుణ సుధాకర్, పి ఆర్ టి యు జిల్లా అధ్యక్షులు రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పట్టాభి, హనుమకొండ జిల్లా అధ్యక్షులు తిరుపతిరెడ్డి, శ్రీహరి, రాష్ట్ర అధ్యక్షులు శ్రీపాల్ రెడ్డి, కమలాకర్, ఎమ్మెల్సీ కూర రగోతం రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, చెన్నకేశవరెడ్డి , ఉమామహేశ్వర్, ఎం ఈ ఓ సత్యనారాయణ, కటకం రఘు, రాజేందర్, సరిత, లక్ష్మణ్, సురేందర్ తదితరులు పాల్గొన్నారు