Wednesday, 4 November 2026

గ్రూప్ వన్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి  జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్

 

సంగారెడ్డి బ్యూరో, జనం సాక్షి, జూన్ 6 :-జిల్లాలో గ్రూప్ వన్ పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. కలెక్టరేట్  సమావేశ మందిరంలో మంగళవారం  అదనపు కలెక్టర్ వీరారెడ్డి తో కలిసి గ్రూప్ వన్ పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో ముందస్తు సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా  కలెక్టర్  మాట్లాడుతూ జూన్ 11న( ఆదివారం ) ఉదయం10:30  గంటల నుండి మధ్యాహ్నం 1:00 వరకు గ్రూప్ వన్ పరీక్ష జరుగు

తుందన్నారు. పరీక్ష నిర్వహణకుజిల్లాలో (   27    ) కేంద్రాలను ఏర్పాటు చేశామని, ( 8654  )మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతున్నట్లు తెలిపారు.

 

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి పరీక్షా కేంద్రాలలో పటిష్టమైన చర్యలు చేపట్టాలని,

ఎలాంటి పొరపాట్లకు తావియ్యరాదని సూచించారు.

కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య పరీక్ష జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.

పరీక్షల నిర్వహణకు  లైజన్ అధికారులను నియమించడం జరిగిందని, వారు చీఫ్ సూపర్డెంట్ తో పాటు పరీక్ష కేంద్రంలో  ఉండి,  సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అన్ని విషయాలలోనూ అప్రమత్తంగా ఉండాలని, ముందస్తు పరీక్ష కేంద్రాన్ని సందర్శించి, అవసరమైన ఆయా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. చీఫ్ సూపర్డెంట్లు గైడ్లైన్స్ అన్నింటిని పునఃశ్చరణ చేసుకోవాలన్నారు.

అభ్యర్థులు తప్పని సరిగా బయోమెట్రిక్ హాజరు  ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. అభ్యర్థులకు తెలిసేలా పరీక్షా కేంద్రం పేరు, పేపర్ కోడ్, ఏరియా ఆయా పరీక్ష కేంద్రం ముందు తప్పనిసరిగా ప్రదర్శించాలని సూచించారు.

ఇన్విజ్ లేటర్లు జాప్యం చేయకుండా కరెక్ట్ టైం కు పేపర్ ఇవ్వాలని, టైం పూర్తయిన వెంటనే తీసుకోవాలన్నారు.

ఉదయం 8:30 గంటల నుండి 10:15 నిమిషాల వరకు అభ్యర్థులను పరీక్షా కేంద్రం లోకి అనుమతిస్తారన్నారు. 10:15 గంటల తర్వాత ఎవరిని లోనికి అనుమతించరని స్పష్టం చేశారు.

పరీక్ష కేంద్రంలోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, సెల్ ఫోన్లు, రైటింగ్ పాడ్స్ అనుమతించరని తెలిపారు. చీఫ్ సూపర్డెంట్ కు మాత్రమే వారి గది వరకు  సెల్ ఫోన్ అనుమతిగలదన్నారు.

అభ్యర్థులను షూస్  తో అనుమతించరని తెలిపారు. అభ్యర్థులు హాల్ టికెట్ ను, బ్లూ లేదా బ్లాక్ పాయింట్ పెన్ మాత్రమే తెచ్చుకోవాలన్నారు.

 

పరీక్ష కేంద్రాలలోని అన్ని గదులలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఏవేని సీసీ కెమెరాలు పనిచేయునట్లయితే ముందుగా తెలియజేయాలని చీఫ్ సూపర్డెంట్ లకు సూచించారు.

పరీక్షా కేంద్రాల్లో త్రాగునీరు, విద్యుత్, ఫ్యాన్లు ,మరుగుదొడ్లు, తదితర మౌలిక సదుపాయాలు ఉండేలా చూసుకోవాలన్నారు.

పరీక్షా సమయంలో నిరంతరాయంగా విద్యుత్తు ఉండేలా చూడాలని విద్యుత్ శాఖ అధికారులకు, పరీక్షా కేంద్రాలకు  అభ్యర్థులు 8:30 గంటలలోగా చేరుకునేలా ఆయా రూట్లలో తగినన్ని బస్సులను నడపాలని ఆర్టీసీ వారికి, పరీక్షా కేంద్రాల పరిసరాలను పరిశుభ్రం చేయించేలా చర్యలు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్లు, డిపిఓ కు సూచించారు.

అదేవిధంగా పరీక్ష కేంద్రాల వద్ద   మెడికల్ కిట్, ఓ ఆర్ ఎస్  పాకెట్లతో ఏఎన్ ఎమ్ ను అందుబాటులో ఉంచాలని వైద్యఆరోగ్యశాఖ అధికారులకు సూచించారు.

చీఫ్ సూపర్డెంట్లు, ఇన్విజిలేటర్లు “నో రిలేషన్ సర్టిఫికెట్” ఇవ్వాలన్నారు. ముందు రోజు కూడా ఇన్విజిలేటర్లకు

శిక్షణ ఇవ్వాలని చీఫ్ సూపర్డెంట్ లకు సూచించారు.

48 మంది అభ్యర్థులు ఉన్న గదిలో ఇద్దరు ఇన్విజిలేటర్లను వేయాలని సూచించారు.

ఆయా అధికారులందరూ సమన్వయంతో పనిచేసి గ్రూప్ వన్ పరీక్ష సజావుగా నిర్వహించాలని కోరారు.

ఈ  సమావేశంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, జెడ్పి సీఈఓ ఎల్లయ్య, డి ఐ ఓ గోవిందరామ్, డీఈఓ వెంకటేశ్వర్లు, డిఆర్ఓ నగేష్, డి.ఎస్.పి రవీందర్ రెడ్డి, ఆర్డిఓ రవీందర్ రెడ్డి, చీప్ సూపర్డెంట్స్, జిల్లా అధికారులు, ఎంపీడీవోలు, తహసిల్దారులు,తదితరులు పాల్గొన్నారు.