Wednesday, 4 November 2026

పి డి ఎస్ యు రాష్ట్ర ఉపాధ్యక్షులు గా ఎం సురేష్ ఎన్నిక

పి డి ఎస్ యు రాష్ట్ర ఉపాధ్యక్షులు గా ఎం సురేష్ ఎన్నిక
జహీరాబాద్ నవంబర్ 7( జనంసాక్షి)
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం 3వ రాష్ట్ర మహాసభలో నవంబర్ 4,5,6 తేదీల్లో వరంగల్ పట్టణంలో విజయవంతంగా 600 ల వందల మంది ప్రతినిధుల సమక్షం లో రాష్ట్ర నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది. ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులుగా నన్ను రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అని సురేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా విద్యారంగ సమస్యలను పరిష్కారంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై అలుపెరుగని పోరాటాలను నిర్వహిస్తామని
పి డి ఎస్ యు విద్యార్థి సంఘాన్ని మరెంతో అభివృద్ధిని ముందుకు తీసుకుపోవడానికి కృషి చేస్తామని, పెండింగ్లో ఉన్న 3,280 కోట్ల పెండింగ్స్ స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ ని విడుదలపై ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కలపనికై రాబోవు రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలకు సంసిద్ధమవుతామని అన్నారు.