రుద్రూర్ ప్రైమరీ హెల్త్ సెంటర్ లో సమావేశం ఏర్పాటు.
ఫోటో :- సమావేశంలో మాట్లాడుతున్న జడ్పిటిసి నారోజి గంగారం…
రుద్రూర్(జనంసాక్షి) :- రుద్రూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మండల ప్రజాప్రతినిధుల మరియు అధికారుల ఆధ్వర్యంలో సోమవారం సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జెడ్పిటిసి నారోజి గంగారం మాట్లాడుతూ. ఆరోగ్య శాఖ నుండి ఆసుపత్రిలోని మరమ్మతులు మరియు నూతన గది నిర్మాణ పనుల కోసం 15 లక్షలు, మరియు స్టోర్ రూమ్ , మీటింగ్ హల్ కోసం జడ్పీ నిధుల నుండి 5+5 లక్షలు మొత్తం రెండు విడతలలో పది లక్షల నిధులను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కృషితో మంజూరు చేయించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస పార్టీ మండల అధ్యక్షులు పత్తి లక్ష్మణ్, పార్టీ సీనియర్ నాయకులు అక్కపల్లి నాగేందర్, పార్టీ ప్రధాన కార్యదర్శి బాలరాజు, పార్టీ గ్రామ అధ్యక్షుడు తోట్ల గంగారం, ఎంపీడీవో బాలగంగాధర్, వైద్య అధికారి దిలీప్ కుమార్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు




