Friday, 6 November 2026

పీఏసీ ఎన్నికల ప్రకటన జారీ

హైద‌రాబాద్ (జ‌నంసాక్షి)

అసెంబ్లీ పీఏసీ, పీయూసీ, ఎస్టిమేట్ కమిటీ ఎన్నికల కోసం ప్రకటన జారీ అయ్యింది. మంత్రి హరీష్ రావు దీనికి సంబంధించిన తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. ప్రతిపక్షనేతతో పాటు తొమ్మిది మంది సభ్యులతో కమిటీని ప్రతిపాదించారు. నామినేషన్ల దాఖలుకు ఈనెల 23 చివరి తేదీగా ప్రకటించారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల 24 చివరి తేదీ. 25న ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *