అహ్మదాబాద్ : అదనపు డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ (ఏడీజీ) పీపీ పాండేకు సంబంధించిన పిటీషన్‌ను గుజరాత్ హైకోర్టు ఈ రోజు విచారించనుంది. పాండే 1982 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి, 2004లో జరిగిన ఇష్రాత్ జహాన్ ఎన్‌కౌంటర్ కేసులో ఆయనను విచారించనున్నారు. ఈ కేసులో ఆయన తనను నిరపరాధిగా ప్రకటించమని కోర్టును కోరారు. ఇష్రాత్ జహాన్ మరో ముగ్గురు కలసి గుజరాత్ ముఖ్యమంత్రిని నరేంద్రమోడీని హత్య చేసేందుకు కుట్రపన్నారని ఆయన పేర్కొన్నారు.




