అనేక కళారూపాలకు తెలంగాణ కళా నిలయమన్నారు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్. హైదరాబాద్… పీపుల్స్‌ప్లాజాలో తెలంగాణ ఆర్ట్‌మేళాను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఇలాంటి ప్రదర్శనల ద్వారా హైదరాబాద్ స్వరూపాన్నే కళాకారులు మార్చేస్తున్నారని కితాబిచ్చారు కేటీఆర్. ఆర్టిస్టులను తెలంగాణ సర్కార్ ప్రోత్సహిస్తుందని భరోసా ఇచ్చారు. జీహెచ్‌ఎంసీ ఆస్తులను పరిరక్షించడంతో పాటు వాటిపై వాల్ రైటింగ్స్ రాయకుండా కఠినచర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నాలుగైదు వందల ఏళ్ల చరిత్ర కల్గిన చేరేలా, నిర్మల్, నఖశి కళలను ఇంకా అభివృద్ధి చేస్తామన్నారు కేటీఆర్.
పీపుల్స్‌ప్లాజాలో తెలంగాణ ఆర్ట్‌మేళా




