Monday, 2 November 2026

మోడీ, కెసిఆర్ పై మండిపడ్డ వెంకట్‌రెడ్డి

hqdefaultప్రధాని మోడీ, ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రజలను మభ్యపెడుతున్నారని, వారిపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మండిపడ్డారు. ప్రధాని, సిఎం ప్రజా కంటక పాలన సాగిస్తున్నారని ఘాటుగా విమర్శిం చారు. శనివారం ఉదయం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాత అంబేద్కర్ భవన్‌లో సిపిఐ జిల్లా మహాసభకు ముఖ్య అతిథిగా వచ్చారు. ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చారని, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సంక్షేమం మరచిపోయారని మండిపడ్డారు. వారి పాలన ఇలాగే కొనసాగితే వారిపై ప్రజలు తిరగబడే పరిస్థితులు రాక తప్పవన్నారు. ప్రధాని మోడీ దేశం మొత్తానికి కాషాయ రంగు పులుముతున్నారని, మైనార్టీ, అణగారిన వర్గాలపై దాడులు చేస్తూ, మత చాందసవాదాన్ని పెంచి పోషిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నా రన్నారు. విదేశాల్లో దాచుకున్న నల్లధనాన్ని తిరిగి తెస్తామని ప్రగల్భాలు పలికిన ప్రధాని ఇప్పటి వరకూ ఆ దిశగా చర్యలు తీసుకోలేదన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారంలోకి రాగానే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మరిచిపోయారన్నారు. తెలంగాణకు తొలి ముఖ్య మంత్రిగా దళితుడినే ముఖ్యమంత్రిగా చేస్తానని లేకుంటే తల నరుక్కుంటానని, భూమిలేని నిరుపేద దళితులకు మూడు ఎకరాల భూమి, కెజి నుంచి పిజి వరకూ ఉచిత నిర్భంద విద్య అందించడం వంటి ఎన్నో హామీలను కెసిఆర్ మరచిపోయారన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *