Tuesday, 3 November 2026

పీహెచ్‌డీ విద్యార్థి ఆత్మహత్య

హైదరాబాద్‌: ఇప్లూలో ఆంగ్ల పీహెచ్‌డీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కాశ్మీర్‌కు చెందిన ముదేసిన్‌ కమరన్‌ పీహెచ్‌డీ రెండో సంవత్సరం చేస్తున్నాడు. స్నేహితుడితో తలెత్తిన వివాదం పోలీసు కేసుకు దారితీయడంతో మనస్తాపానికి గురైన ముదేసిర్‌ నిన్న అర్థరాత్రి తన గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. యూనివర్సిటీ పరిధిలో పరిష్కరించాల్సిన వివాదాన్ని పోలీసుస్టేషన్‌ వరకూ తీసుకువెళ్లి విద్యార్థి మృతికి కారణమయ్యారంటూ పలువురు ఇప్లూలో ఆందోళనకు దిగారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *