Thursday, 5 November 2026

పుచ్చలపల్లి సుందరయ్య కు ఘన నివాళులు

పెనుబల్లి, మే 19(జనం సాక్షి)
అమరజీవి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి పెనుబల్లి లో ఘనంగా నిర్వహించారు. వి ఎం బంజర్ సిపిఎం కార్యాలయంలో సుందరయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. వర్ధంతి సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించారు. దక్షిణ భారతదేశం లో మార్సిస్టు ఉద్యమాన్ని నిర్మించి బడుగు బలహీన, రైతాంగ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా తన జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత త్యాగమూర్తి కామ్రేడ్ సుందరయ్య అని కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు చలమాల విట్టల్ రావు ,మండల కార్యదర్శి గాయం తిరుపతిరావు మామిళ్ళ వెంకటేశ్వరరావు, కండే సత్యం , మిట్టపల్లినాగమణి, కొప్పుల వెంకటేశ్వరరావు, నల్లమల ప్రతాప్ పాల్గొన్నారు.