సంగారెడ్డి బ్యూరో, జనం సాక్షి, మే 19 : సంగారెడ్డి పట్టణం మహిళా డిగ్రీ కాలేజ్ ప్రాంగణంలో శుక్రవారం మహిళా విద్యార్థులకు బ్లాక్ బెల్ట్ ట్రైనింగ్ క్యాంప్ కార్యక్రమం మాస్టర్ మల్లేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా డిసిసిబి వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం ముఖ్యఅతిథిగా హాజరై పట్నం మాణిక్యం ఫౌండేషన్ ద్వారా విద్యార్థులకు సర్టిఫికెట్స్, మెమొంటోస్ అందజేశారు. విద్యార్థుల ప్రదర్శన అందరిని ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, కరాటే ట్రైనర్ మాస్టర్ మల్లేశం తదితరులు పాల్గొన్నారు.




