Thursday, 5 November 2026

పుట్టినరోజు సందర్భంగా నిరుపేదలకు దుప్పట్ల పంపిణీ

పుట్టినరోజు సందర్భంగా నిరుపేదలకు దుప్పట్ల పంపిణీ

చింతలమానేపల్లి జనంసాక్షి:మండలంలోని డబ్బా గ్రామానికి చెందిన శ్రీ శివరామ సాయి యూత్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు గుర్లే శ్రీనివాస్ పుట్టిన రోజును పురస్కరించుకుని మండలంలోని ఆడేపల్లి గ్రామంలోని నిరుపేదలకు దుప్పట్లను పంపిణీ చేశారు.ఈకార్యక్రమంలో ఆడేపల్లి గ్రామ సర్పంచ్ సంతోష్ గౌడ్,మాలి సంఘం మండల అధ్యక్షుడు నికోడె బాపురావు,గ్రామయువకులు మహేష్ గౌడ్,సందీప్,వెంకటేష్ ,అన్నం నాగయ్య,ప్రకాష్, భీంరావు,తదితరులు పాల్గొన్నారు.