విద్యార్థులు బాల్యం నుండి శాస్త్రీయ అవగాహనను పెంచుకోవాలి…
-మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల రజిత
హుస్నాబాద్ 22 నవంబర్ జనంసాక్షి
జన విజ్ఞాన వేదిక తెలంగాణ ఆధ్వర్యంలో సమగ్ర శిక్ష తెలంగాణ ప్రభుత్వం సహకారంతో బాల బాలికల విద్యా విజ్ఞానం వికాసం కోసం నిర్వహించ బడుతున్న చెకుముకి సైన్స్ సంబరాలు 22 లో భాగంగా ఈరోజు హుస్నాబాద్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలుర ఆవరణలో అక్కన్నపేట హుస్నాబాద్ మండలాలకు చెందిన అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉన్నత పాఠశాలల నుంచి హాజరైన 8,9,10 తరగతుల విద్యార్థినీ విద్యార్థులకు మండల స్టాయి టాలెంట్ పరీక్ష నిర్వహించడం జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న హుస్నాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న మాట్లాడుతూ విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే శాస్త్రీయ అవగాహన పెంచుకోవాలని మూఢనమ్మాలకాల పట్ల దూరంగా ఉండాలని కోరారు.
టాలెంట్ పరీక్షలు విద్యార్థులలోని ప్రతిభా శక్తిని, పోటీ తత్వాన్ని పెంచుతాయని తెలిపారు.
అనంతరం మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఐలేని అనిత, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలుర ప్రధానోపాధ్యాయురాలు బండారి మనీలా నిర్వాహకులు అభినందిస్తూ ప్రభుత్వం విద్యార్థులను బాల శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడానికి ఎన్నో అవకాశాలను కల్పిస్తున్నదని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. మూఢనమ్మకాల రూపుమాపడానికి తల్లిదండ్రులకు పలు సూచనలు ఇవ్వాలని కోరారు. చెకుముకు టాలెంట్ పరీక్షలు ప్రథమ స్థానంలో నిలిచిన వారు ఈనెల 27 న సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిర్వహించే జిల్లాస్థాయి చెకుముకి టాలెంట్ పరీక్షలకు హాజరుకావాలని
నిర్వాహకులు కోరారు. ఈ కార్యక్రమంలోజనవిజ్ఞాన వేదిక జిల్లా ఉపాధ్యక్షులు చింతకింది శ్రీనివాస్, బత్తిని శ్రీనివాస్, వెంకటరమణారెడ్డి ధనలక్ష్మి, మార్కండేయ దూడం నాగభూషణం, వీర సోమయ్య వివిధ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థి విద్యార్థులు పాల్గొన్నారు.




