Thursday, 5 November 2026

పుదుచ్చేరి సభలో ఐక్యతపై చర్చిస్తాం

అనంతపురం,మార్చి25  : రుణమాఫీ విషయంలో రైతులను పూర్తిగా మోసం
చేశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఆరోపించారు.  ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలైనా ప్రజాసమస్యలపై చర్చించేందుకు ఇప్పటికి అఖిలపక్ష కమిటీ వేసేందుకు ప్రభుత్వం ముందుకు రాకపోవడం వారి వైఖరి స్పష్టమవుతోందన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వ పాలన రాచరిక వ్యవస్థను తలపించేలా కొనసాగుతోందని పేర్కొన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్షాలను నోరు తెరవనీయకుండా కట్టడి చేసేందుకు సస్పెండ్‌ చేయడం అప్రజాస్వామికమని తెలిపారు. పుదుచ్చేరిలో జరిగే జాతీయ మహాసభలలో వామపక్ష పార్టీల ఐక్యతపై చర్చ జరుగుతందని అన్నారు. దీనికి వామపక్ష పార్టీలను ఆహ్వానించామని, ఇందులో పార్టీల ఐక్యతపై చర్చ జరగనుందన్నారు. ప్రారంభ సభలో సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్‌కారాత్‌ పాల్గొంటున్నారని తెలిపారు. అసంఘటిత కార్మికులు తమ సమస్యలను విన్నవించుకునేందుకు రైళ్లలో టికెట్టు కొని వెళ్తుంటే అక్రమంగా అరెస్టులు చేయడం దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు. ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపా మంత్రులు, శాసన సభ్యులు ఓట్లను  వెలగట్టారని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *