పురుగుమందు సేవించి చికిత్స పొందుతూ యువతి మృతి

టేకులపల్లి, జూలై 15 (జనం సాక్షి ): రెండు రోజుల క్రితం పురుగుమందు సేవించి ఆత్మహత్యకు పాల్పడిన ఓ యువతి ఖమ్మం పట్టణంలోని మమత హాస్పిటల్ లో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందింది. టేకులపల్లి ఎస్సై రమణారెడ్డి కథనం ప్రకారం మండలంలోని పాత తండాకి చెందిన భూక్య లింబా నాయక్ కూతురు భూక్య పావని (24) ఇంట్లో ఎవరూ లేని సమయంలో పావని పురుగుమందు తాగడంతో గమనించిన స్థానికులు చేను పనులకు వెళ్లిన తండ్రి లింబ నాయక్ కి ఫోన్ చేసి సమాచారం అందించారు. దీంతో తండ్రి హుటాహుటిన ఇంటికి చేరుకొని పురుగుమందు సేవించిన తన కూతురు పావనిని వెంటనే కొత్తగూడెం వైద్యశాలకు తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో ఖమ్మం కు రిఫర్ చేశారు. మమత హాస్పిటల్ లో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందింది. పావనికి వివాహం చేయడానికి పెళ్లి సంబంధాలు తండ్రి చూస్తుండడంతో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక మనస్థాపానికి గురై తన కూతురు ఆత్మహత్యకు పాల్పడినట్లు తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

తాజావార్తలు