Thursday, 5 November 2026

పెంచికల్ పేటలో బోర్ వెల్ డ్రిల్లింగ్ పనులను ప్రారంభించిన సర్పంచ్

 

 

 

 

 

జనం సాక్షి , కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం పెంచికల్ పేట్ గ్రామ పంచాయితీ యందు ఆర్ జి-2 ఏరియా, ఓసీపీ-3 ప్రాజెక్ట్ ప్రభావిత గ్రామాల్లో రేమిడియేషన్ ప్లాన్ ద్వారా పెంచికల్ పేట్ గ్రామానికి కేటాయించిన ఐదు బోర్ వెల్ డ్రిల్లింగ్ పనులను శనివారం గ్రామ సర్పంచ్ కొండ వెంకటేష్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. సింగరేణి సంస్థ గ్రామాల అభివృద్ధికి వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజా ఆరోగ్య దృష్ట్యా ఉచిత మెడికల్ క్యాంప్ లు, యువతకి లైట్ మోటర్ వెహికిల్ డ్రైవింగ్ శిక్షణతో ఉచిత డైవింగ్ లైసెన్స్, కుట్టు మిషన్ శిక్షణ తరగతులు కూడా ఉచితంగా నిర్వహించారుఅని ఈ సందర్భంగా తెలియచేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ లింగాల కుమార్, వార్డు సభ్యులు ఎద్దు రాజయ్య, కుమ్మరి జయ, చీటీ పద్మ, చిమ్మనవేన మల్లేష్, గోసిక స్వామి, చొప్పరి రాధ, బీఆర్ఎస్ నాయకులు గొడిశెల సంపత్, బైరీ అంజయ్య, కమ్మటి సాయి, ఐట్ల పవన్ కళ్యాణ్, గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆనందచారీ తో పాటు సిబ్బంది ఫీల్డ్ అసిస్టెంట్ రాజయ్య, కరోబర్ శంకర్ మరియు గౌడ్ సంఘ నాయకులు ఆకెనపల్లి సుధాకర్ గౌడ్, పడాల సుధాకర్ గౌడ్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.