సూర్యాపేట ప్రతినిధి, మార్చి 24 (జనంసాక్షి): గత కొన్ని నెలలుగా ఈ కుబేర్ వద్ద పెండింగులో ఉన్న బిల్లులన్ని మంజూరు చేయాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ రాష్ట్ర నాయకులు ఎన్.సోమయ్య , ఎం.కృష్ణా రెడ్డి, ఆర్.లింగయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శుక్రవారం సూర్యాపేట ట్రెజరరీ ఆఫీస్ ముందు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో పెండింగ్ బిల్లులన్ని మంజూరు చేయాలని నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా ఉపాధ్యాయుల ఉద్యోగులకు రావాల్సిన
డిఏ , పిఆర్సీ బకాయిలు , సరెండర్ వేతనాలు, జిపిఎఫ్ అప్పులు, పార్ట్ ఫైనల్, ఫైనల్ పేమెంట్లు, ఎయిడెడ్ ఉపాధ్యాయుల మూడు నెలల వేతనాలు మంజూరు చేయకుండా ఈ కుబేర్ వద్ద పెండింగ్ లో ఉన్నాయని అన్నారు.ఆర్థిక సంవత్సరం పూర్తి కావస్తున్నందున ఈ నెల 28 లోపు బిల్లులన్నీ మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ నెల 28న హైదరాబాదులో ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ తరఫున మహా ధర్నాను నిర్వహిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో అనిల్ కుమార్, ముత్తయ్య , బిక్షపతి, బివి రావు, శ్రీనివాస్ రెడ్డి,వీరన్న, వెంకటేశ్వర్లు, వెంకటయ్య , సుభాని, దశరథ రామారావు, యాకయ్య , పూలన్ , సిద్దిక్ పాషా, సయ్యద్, కృష్ణమూర్తి, వెంకటయ్య, మంగ, సుధాకర్ రెడ్డి, కమల, సింహాద్రి, వీరారెడ్డి, యాదగిరి, క్రాంతికుమార్, క్రాంతిప్రభ తదితరులు పాల్గొన్నారు.




