ఆసిఫాబాద్ జనంసాక్షి జిల్లా ప్రతినిధి: మార్చి 24 :
భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలోని ఈవిఎం గోదాములో భద్రపరిచిన 891 వి. వి. పాట్లను పరిశీలించడం జరిగిందని జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావు తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఈవిఎం గోదాములో భద్రపరిచిన వి.వి పాట్లను జిల్లా అదనపు కలెక్టర్ రాజేశంతో కలిసి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తెరచి హైదరాబాద్ నుండి వచ్చిన ఈసీఐఎల్ కంపెనీ ఇంజనీర్లు పరీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం పనిచేసేలా తనిఖీలు, పరిశీలన చేయడం జరుగుతుందని తెలిపారు. ఈవిఎం గోదామును పటిష్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య పరిరక్షించడం జరుగుతుందని, సి సి కెమెరాల పర్యవేక్షణ నిరంతరం ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఆర్ డి ఓ రాజేశ్వర్, తహసిల్దార్ రామ్మోహన్, ఎన్నికల నాయబ్ తహసిల్దార్లు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.