Thursday, 5 November 2026

పెండింగ్ బిల్లుల విడుదలకై కలెక్టరేట్ వద్ద నిరసన

పెండింగ్ బిల్లుల విడుదలకై కలెక్టరేట్ వద్ద నిరసన* టిపిటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోత్ హరిలాల్ నాయక్
టేకులపల్లి, మార్చి 21( జనం సాక్షి ): ఈ నెల 24న పెండింగ్ బిల్లుల విడుదలకై కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో జరప తలపెట్టినందున విజయవంతం చేయాలని టి పి టి ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోతు హరిలాల్ నాయక్ పిలుపునిచ్చారు. టేకులపల్లి టిపిటిఎఫ్ మండల అధ్యక్షులు వాసం భాస్కర్ రావు అధ్యక్షతన గురువారం జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ  ఉపాధ్యాయ ఉద్యోగుల వేతనాలను ప్రతి నెల ఒకటో తేదీనే చెల్లించాలని,ఈ కుబేర్ లో గత కొన్ని నెలలుగా పెండింగ్లో ఉన్న ఎయిడెడ్ టీచర్ల వేతనాలు, సప్లమెంటరీ వేతనాలు,సెలవు జీతాలు, టిఎస్జిఎల్ఐ, జిపిఎఫ్ క్లైములు,పిఆర్సి బకాయిలు,మెడికల్ రియంబర్స్మెంట్ బకాయిలు,పెన్షన్ బకాయిలు వెంటనే వ్యక్తిగత ఖాతాలలో జమ చేయాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు 24న మధ్యాహ్నం 3 గంటలకు యుఎస్పిసి ఆధ్వర్యంలో నిర్వహించే నిరసన ప్రదర్శనకు ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని  హరిలాల్ నాయక్ కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కుబేరులో పెండింగ్ లో ఉన్నటువంటి అన్ని బిల్లులను 24వ తేదీ లోపు వ్యక్తిగత ఖాతాలలో జమ చేయాలని,లేనిచో ఈనెల 28న హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద గల ధర్నా చౌక్ లో ధర్నా చేయడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈ సమావేశంలో మండల ప్రధాన కార్యదర్శి ఎం.రమణ,జిల్లా కౌన్సిలర్ బి.రామరాజు,మండల కార్యదర్శి జి.నందా పాల్గొన్నారు.