Thursday, 5 November 2026

విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలి

.విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలి.

జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి.
గురుకుల పాఠశాల ఆకస్మిక తనిఖీలో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

రాజన్నసిరిసిల్లబ్యూరో., మార్చి 23. (జనం సాక్షి) విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలనీ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ప్రిన్సిపాల్ ను ఆదేశించారు.
గురువారం సిరిసిల్ల పట్టణం పెద్దూరు మహాత్మా జ్యోతిబా ఫూలే టీఎస్ బీసీ సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలనుజిల్లా  కలెక్టర్  ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు ను పరిశీలించారు. మొత్తం 427 మంది విద్యార్థులకు గానూ 361 మంది విద్యార్థులు రెసిడెన్షియల్ పాఠశాల లో ఉన్నట్లు ప్రిన్సిపల్ జిల్లా కలెక్టర్ కు తెలిపారు. గురుకుల విద్యార్థుల కోసం సిద్ధం చేస్తున్న వంటకాలను పరిశీలించారు. క్వాలిటీ రైస్, కూరగాయల తో తయారు చేసిన  వంటకాలను మాత్రమే విద్యార్థులకు వడ్డిoచాలని ఆదేశించారు. వంట గదితో పాటు గురుకులంలో పరిశుభ్రత కు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.నిత్యావసరాల స్టాక్ ను రిజిస్టర్ లలో నమోదు లను పరిశీలించారు. రిజిస్టర్ లలో అప్డేట్ లు సరిగా చేయకపోవడంతో నిర్వాహకులను మందలించారు. రిజిస్టర్ లలో ఎప్పటి కప్పుడు నిల్వ ఉన్న నిత్యావసరాల వివరాలను అప్డేట్ చేయాలన్నారు.అనంతరం గురుకులంలో నీ మరుగుదొడ్లను పరిశీలించారు. కొన్ని టాయిలెట్ బ్లాక్ లలో ట్యాప్ లను రిపేర్ చేపించాలనీ చెప్పారు.అనంతరం జిల్లా కలెక్టర్ తరగతి గదుల్లో బోధన జరుగుతున్న తీరు ను పరిశీలించారు.గురుకులంలో ఉన్న విద్యార్థులను బెడ్స్, ఫ్యాన్స్ ఇతరత్రా సదుపాయాలను పరిశీలించారు. భోజనానికి సంభందించిన మెనూ ను తప్పనిసరిగా పాటించాలని వసతి గృహం సిబ్బందిని ఆదేశించారు.  గురుకులంలో ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ ప్రిన్సిపల్ కు సూచించారు.ఆకస్మిక తనిఖీలో జిల్లా కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.