Wednesday, 4 November 2026

పెట్రోల్‌ పోసి నిప్పంటించారని పోలీసులకు మహిళ ఫిర్యాదు

చార్మినార్‌ : తనపై కొందరు పెట్రోల్‌ పోసి నిప్పంటించారని డబీర్‌పురా పోలీసులకు ఓ మహిళ ఆదివారం ఫిర్యాదు చేసింది. తాను ఇంటి వద్ద నిలబడి ఉండగా ఏడుగురు వ్యక్తులు తనపై పెట్రోల్‌ పోసి నిప్పంటించేందుకు ప్రయత్నించినట్టు మీర్‌చౌక్‌ ప్రాంతంలో నివసించే నయీమాబేగం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఆమె శరీరంపై 20 శాతం కాలిన గాయాలున్నట్టు గుర్తించారు. సంఘటన జరిగిన తీరుపై ఆమె పొంతనలేని సమాధానాలిస్తుందన్నారు. ఈమె పలువురు ప్రభుత్వ అధికారులు, స్థానికులపై మోసపూరిత ఫిర్యాదులు గతంలో చేసినట్టు చెప్పారు. నయీమాబేగంపై పలు పోలీస్‌స్టేషన్‌లలో 12కు పైగా ఫిర్యాదులున్నట్టు తెలిసింది. సంఘటనపై దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామని ఈస్ట్‌జోన్‌ డీసీపీ సత్యనారాయణ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *