హైదరాబాద్, నగరంలోని గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. అమరవీరుల స్థూపం వద్దకు దూసుకువచ్చిన ఓ యువకుడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. వెంటనే స్పందించిన పోలీసులు ఆ ప్రయత్నాన్ని అడ్డుకుని యువకుడిని అరెస్టు చేశారు.
వరంగల్‌లో జరిగిన శృతి, విద్యాసాగర్‌ల ఎన్‌కౌంటర్‌పై నిరసన వ్యక్తం చేస్తూ బుధవారం తెలంగాణ ప్రజాస్వామ్య వేదిక ఛలో అసెంబ్లీకి పిలుపు ఇచ్చింది. అసెంబ్లీ ముట్టడికి ప్రజా సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం హైద్రాబాద్‌కు వస్తున్న నాయకులు, కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుని అరెస్టులు చేశారు. దీంతో పలు చోట్లు ఉద్రికపరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే గన్‌పార్క్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.




