హైదరాబాద్: గోషామహల్ లోని హిల్‌టాప్ సర్వీసెస్ పెట్రోల్ బంక్‌పై తూనికలు, కొలతల శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. డీజిల్, పెట్రోలు అమ్మకాల్లో మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. 20 లీటర్లకు లీటర్ తక్కువగా వస్తున్నట్లు గుర్తించి బంక్ యాజమాన్యం పై అధికారులు కేసు నమోదు చేశారు.




