రూ. 500, రూ. 1000 నోట్ల రద్దు ప్రభావం మంగళవారం రాత్రి పెట్రోల్ బంకులలో కనిపించింది. ఈ సమాచారం పెట్రోల్ బంకుల వరకు చేరనంత వరకు వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఈ సమాచారం పెట్రోల్ బంకులకు చేరాక అనేక సమస్యలు ఉత్పన్నం అయ్యాయి. పెట్రోల్ బంకుల వద్ద వద్ద రూ.100, రూ.500, రూ.1000 నోట్లకు సరిపడ పెట్రోల్ వేయించుకోవాల్సిందే తప్ప, అంతకు తక్కువ పెట్రోల్ వేయించుకునే అవకాశం లేకుండా పోయింది.కానీ ఐదు వందల నోటు ఇచ్చి వంద రూపాయల పెట్రోల్ వేయండి అంటే మిగతా చిల్లర చెల్లించడానికి బంకులు నిరాకరించాయి.వంద పెట్రోల్ వేయాలంటే మిగతా రూ. 400 చెల్లించడానికి తమ వద్ద వంద నోట్లు లేవని బంకుల నిర్వహకులు నిరాకరించారు. ఇలా ఉండగా హైదరాబాద్ నగరంలో చాలామటుకు పెట్రోల్ బంకుల్లోనూ. రూ.500, రూ.1000 నోట్లు చెల్లుబాటు కాలేదు.
పెట్రోల్ బంకులలో కూడా చిల్లర లేదు..!




