-రైతులకు కరెంట్ సక్రమంగా సరఫరా చేయాలి.బిజెపి మండలాధ్యక్షుడు పధిర భీమేశ్వర్ రెడ్డి.నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఫిబ్రవరి 13(జనంసాక్షి):పెద్దకొత్తపల్లి మండలం రైతులకు విద్యుత్ ను సక్రమంగా సరఫరా చేయాలని బిజెపి మండలాధ్యక్షుడు పదిరభీమేష్ డిమాండ్ చేశారు.సోమవారం మండల కేంద్రంలోని బస్టాండ్ చౌరస్తాలో మండల రైతులకు విద్యుత్తు సరఫరా సరిగా జరుగుతలేదని నిరసిస్తూ మండల శాఖ ఆధ్వర్యంలో రస్తారోకో నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసిఆర్ దిష్టి బొమ్మను దహనం చేశారు.దాదాపు గంట పాటు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.రస్తారోకో చేస్తున్న బిజెపి నాయకులను, కార్యకర్తలను స్థానిక ఎస్సై రాము యాదవ్ ఆద్వర్యంలో పోలీసులు అరెస్టు చేసి పోలీసుస్టేషన్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు పధిర భీమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ గత ఐదారు రోజుల నుంచి మండలంలోని రైతులకు విద్యుత్ సరఫరా సరిగా అందని కారణంగా పంటలు ఎండిపోతున్నాయని చివరి దశకు వచ్చిన పంటలు చేతికి అందక రైతులు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వము స్థానిక ఎమ్మెల్యే ,విద్యుత్ శాఖ సిబ్బంది త్వరగా స్పందించి రైతుల యొక్క సమస్యను గుర్తించి నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్తును అందివ్వాలని డిమాండ్ చేశారు.లేని పక్షంలో రైతుల కోసం భారతీయ జనతా పార్టీ ఎంత పోరాటానికైనా సిద్ధంగా ఉంటుందని ఘాటుగా వ్యాఖ్యానించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ మోర్చా కార్యదర్శి జలాల్ శివుడు ,పార్టీ జిల్లా కార్యదర్శి శరత్ రెడ్డి ,మండల ఇన్చార్జి కడ్తాల కృష్ణయ్య, మండల ప్రధాన కార్యదర్శి తిరుమల్, భీనమోని లింగస్వామి, ఇంద్రకంటి శేఖర్, నాగరాజు శ్రీకాంత్, సరాయి శేఖర్,కోట్ల సుధాకర్ , శ్రీనివాసరావు, కృష్ణారావు,కురుమయ్య , చంద్ర శేఖర్,మార్కండేయ,శరత్ ,శివ ,నరేష్, రాము తదితర బిజెపి కార్యకర్తలు ,రైతులు పాల్గొన్నారు.





