పెద్దూరు ఎల్లమ్మ గుట్టను వడ్డెరలకే ఇవ్వాలి.

లెక్టరేట్ ఎదుట వడ్డెరల ఆందోళన.

రాజన్న సిరిసిల్ల బ్యూరో. ఆగస్టు 22. (జనంసాక్షి). సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూరు ఎల్లమ్మ గుట్టను వడ్డెరలకే ఇవ్వాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట మంగళవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వడ్డెర సంఘం నాయకులు సూర దేవరాజు తో పాటు పలురు మాట్లాడుతూ పెద్దూరు శివారులోని ఎల్లమ్మ గుట్ట స్పిన్నింగ్ మిల్ నిర్వాహకులు ప్రైవేటు వ్యక్తులకు అమ్మి వేశారని అన్నారు. నిజానికి ఎల్లమ్మ గుట్ట వారి పరిధిలో లేదని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి ఎల్లమ్మ గుట్టపై ఆధారపడి 300 పైగా కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఎల్లమ్మ గుట్టను వడ్డెరలకి కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు అధికారులకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో పలువురు వడ్డెర సంఘం నాయకులు పెద్దూరు వడ్డెరలు పాల్గొన్నారు.