టైటిల్ *కుర్మలకు గొర్రెలను ఎరగా చూపి రాజ్యాదికారం దూరం చేసిన బీఆర్ఎస్ పార్టీ .
జనంసాక్షి న్యూస్ /ఆగస్టు 22/తుర్కపల్లి మండలం/ యాదాద్రి భువనగిరి జిల్లా/ ఆలేరు నియోజకవర్గంకురుమలకు గొర్రెలను ఎరగా వేసి రాజ్యాధికారం మరొక సారి దూరం చేసిన బీఆర్ఎస్ పార్టీ అని
రాష్ట్రీయ సంగోలి రాయన్న సేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సోమల్ల మహేందర్ కురుమ అన్నారు
వారు మాట్లాడుతూ
సోమవారం 115 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను బీఆర్ఎస్ పార్టీ ప్రాకటించడం జరిగింది, తెలంగాణ లో 10% కురుమల ఓటు బ్యాంక్ ఉంది, బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఏ ఒక్క కురుమ కుల సభ్యునికి అసెంబ్లీ అభ్యర్థికి సీటు కేటాయించకపోవడం హేళనమైన నిర్ణయం. కురుమ కులాన్ని గుర్తించని బీఆరేస్ పార్టీని భూస్థపితం చేస్తామని అన్నారు.
కురుమలని జనాభా ధమాషా ప్రకారం అసెంబ్లీ సీట్లు ఏ పార్టీ కేటాయిస్తే ఆ పార్టీ కి కురుమ కులం అండగా ఉంటుందని రాష్ట్రీయ సంగోలి రాయన్న తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సోమల్ల మహేందర్ కురుమ తెలిపారు.