జుక్కల్, మార్చి 24,( జనం సాక్షి),
పరువు నష్టం కేసులో ఏఐసీసీ అగ్ర నేత రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించడం పట్ల కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజక వర్గం పెద్దకొడప్ గల్ లోని గాంధీ విగ్రహం వద్ద శుక్రవారం మాజి ఎమ్మెల్ల్యే సౌధాగర్ గంగారాం అధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు మౌనదీక్ష చేసి నిరసన తెలిపారు. ఈకార్యక్రమంలో
పిసిసి డెలిగేట్ విఠల్ రెడ్డి, జుక్కల్, పెద్ద కొడప్గల్, పి ట్లం, బిచ్కుంద, నిజాంసాగర్, మద్నూర్
మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వరుసగా
దాదా రావ్ పటేల్, మహిందర్ రెడ్డి, జంబిగే హన్మండ్లు, దర్పల్ గంగాధర్, రవీందర్ రెడ్డి, పట్నలవర్ రమేష్, మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
పెద్ద కొడప్ గల్ లో గాంధీ విగ్రహం ముందు కాంగ్రెస్ మౌనదీక్ష




