పెనుబల్లి, జూన్ 27(జనం సాక్షి)
పెనుబల్లి గ్రామ పంచాయితిలో నాయకుల బజార్, ఎస్ సి కాలని మధ్యలో నిర్మించ బోయే సిసిరోడ్డుపనులకుమంగళవారం పెనుబల్లి మాజీ ఎంపీ టి సి, బీఆర్ఎస్ నాయకులు కోటగిరి సుధాకర్ బాబు, సర్పంచ్ తావు నాయక్, ఏంపి టిసి చీపు లక్ష్మీకాంత్ ల తో కలిసి శంకుస్థాపన చేశారు, ఈ జిఎస్ నిధులతో సిసి రోడ్డు పనులను ప్రారంభించారు, ఈ సంధర్భంగా కోటగిరి సుధాకర్ బాబు మాట్లాడుతూ మన ఎం ఎల్ ఏ సండ్ర వెంకటవీరయ్య సహాకారంతో మనగ్రామంలో దాదాపు అన్ని అంతర్గత రోడ్లను సిసి రోడ్లుగా మార్చు కున్నామని,సాధ్యమైనంత వరకు ఎంఎల్ఏ సహాకారంతో మిగిలిన సిసి రోడ్ల తో పాటు, గ్రామాభవృద్ధికి కృషి చేద్దామని అన్నారు, ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ పానేం నాగేశ్వరరావు, బొర్రా వెంకటేశ్వర్లు, మల్లెల సతీష్, కో- ఆప్షన్ సభ్యలు షేక్ గౌస్, చీపివెంకటేస్వర్లు,జిల్లెళ్ళ వెంకటేశ్వర్లు, బజ్జూరి గోపీ, పొట్లపల్లి ప్రసాద్, మారిని శ్రీను, మారిని రాంబాబు, బుస్కా నరసింహారావు,రేగళ్ళ కృష్ణ, సింహాద్రి శివ, పాల్గొ న్నారు.
పెనుబల్లి లో సిసి రోడ్డు పనుల కు శంకుస్థాపనచేసిన కోటగిరి




