Monday, 2 November 2026

పెనుయేలు చర్చీలో క్యాలెండర్ ఆవిష్కరణ

“పెనుయేలు చర్చీలో క్యాలెండర్ ఆవిష్కరణ”

పెన్ పహాడ్, జనవరి 01(జనంసాక్షి): నూతన సంవత్సర వేడుకను మండల పరిధిలోని  చీదెళ్ల గ్రామంలో గల పెనుయేలు వర్షిప్ సెంటర్ లో పెనుయేలు సంఘాల అధ్యక్షులు, సంఘకాపరి పాస్టర్ జె జె సామ్యూల్ సన్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆదివారం ఘనంగా ఆవిష్కరించారు. తొలుత చర్చీలో వాగ్దానాల కార్డులు, నూతన సంవత్సర కేక్ కటింగ్ లాంటి కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా పాస్టర్ జె జె సామ్యూల్ సన్ మాట్లాడుతూ, నూతన సంవత్సరంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఆ భగవంతుడు ప్రతి ఒక్కరిని చల్లగా చూడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సంఘపెద్దలు మాణిక్యమ్మ, పౌలు, లాజరు, వీరాచారి, హసేన్, సైమన్, రమేష్, మార్థమ్మ, సువార్తమ్మ తదితరులు పాల్గొన్నారు.