తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ
జహీరాబాద్ జనవరి 1 (జనంసాక్షి)
తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్ )సంగారెడ్డి జిల్లా క్యాలెండర్ ను బర్దిపూర్ ఆశ్రమం పీఠాధిపతి శ్రీ డాక్టర్ సిద్దేశ్వర స్వామి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రూపొందించిన క్యాలెండర్ దేశభక్తి జాతీయత ఉట్టిపడేలా ఉందని భావి భారత పౌరులను తీర్చిదిద్దేటటువంటి బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని గురువు యొక్క విశిష్టత గురించి తెలియజేశారు ఈ యొక్క కార్యక్రమంలో తపస్ జిల్లా అధ్యక్షులు దత్తాత్రి రాష్ట్ర బాధ్యులు నరసింహారెడ్డి, జిల్లా గౌరవ అధ్యక్షులు గోపాల్ డివిజన్ అధ్యక్షులు తుక్కప్ప వివిధ మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కృష్ణ మొగులయ్య శేఖర్ శ్రీవర్ధన్, సంజీవ్ కుమార్ తుకారం, హనుమంతు విట్టల్, సాయి కృష్ణ మోహన్, బిజెపి నాయకులు సుధీర్ కుమార్. అడివెన్న, సుధీర్ బండారి, శ్రీనివాస్ గుప్తా, నర్సింలు, పద్మారావ్, పవన్, ఆంజనేయులు, జయకృష్ణ పాల్గొన్నారు.
తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ




