Thursday, 5 November 2026

పెన్షన్ల కోసం రోడ్డెక్కిన వృద్ధులు

అదిలాబాద్‌,ఫిబ్రవరి20 ( జ‌నంసాక్షి)
: ఐదు నెలలుగా తమకు పింఛన్లు అందడం లేదంటూ అభయహస్తం లబ్దిదారులు శుక్రవారం ఆందోళనకు దిగారు. దండేపల్లి మండల కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. వృద్ధులకు, వికలాంగులకు పింఛన్లు పెంచిన ప్రభుత్వం తమకు మాత్రం అన్యాయం చేసిందని మండిపడ్డారు. ఎన్నో నెలలుగా ఆందోళన చేస్తున్నా పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గంటపాటు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అధికారులు వచ్చి హావిూ ఇవ్వడంతో శాంతించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *