హైదరాబాద్,ఫిబ్రవరి20( జనంసాక్షి)
: ఎప్పుడూ విధుల్లో తీరిక లేకుండా ఉండే పోలీసులు తమ ఆరోగ్యాన్ని కూడా పరిరక్షించుకోవాలని సోమాజిగూడ ఏషియన్ ఈఎన్‌టీ ఆసుపత్రి ఎండీ డాక్టర్ చావా ఆంజనేయులు, అవిూర్‌పేట ప్రైమ్ ఆసుపత్రి వైద్యుడు గణెళిశ్ అన్నారు. శుక్రవారం పంజాగుట్ట ట్రాఫిక్ పోలీసు స్టేషన్‌లో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో పంజాగుట్ట ట్రాఫిక్ ఏసీపీ షేక్ మాసుం భాషా, పంజాగుట్ట ట్రాఫిక్ ఇన్‌స్పెక్టరు శ్రీనివాస్‌తో పాటు సిబ్బంది ఈ శిబిరంలో పాల్గొని వైద్య సేవలు పొందారు. ఈ కార్యక్రమంలో వైద్యులు మాట్లాడుతూ వాహనాల రద్దీ ఉన్న ప్రాంతాల్లో అత్యధిక కాలుష్య కారకాలు, బెంజీన్ నమోదవుతున్నాయని, అందువల్ల పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఇన్‌స్పెక్టరు శ్రీనివాస్ మాట్లాడుతూ సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా పోలీసులకు ఈసీజీ, పీఎఫ్‌టీ, రక్తపరీక్షలు, మధుమేహ పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో 120 మంది పోలీసులు ఆరోగ్య పరీక్షలు చేసుకున్నారు.




