Monday, 2 November 2026

పెరూలో భారీ భూకంపం

పెరూలో భారీ భూకంపం చోటుచేసుకుంది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.5గా నమోదైంది. భూకంప ధాటికి ప్రజలు ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. పలు ప్రాంతాల్లో భవనాలు కదిలిపోయాయి. పెరూవియన్, బ్రెజీలియన్ సరిహద్దులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. భూకంపం కారణంగా సునామీ వచ్చే అవకాశం కూడా ఉందని వారు హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *