Tuesday, 3 November 2026

పెళ్లికి వెళ్లి వస్తూ వ్యక్తి మృతి

ఆదిలాబాద్: శుభకార్యానికి వెళ్లి వస్తుండుగా ప్రమాదవశాత్తు ఒకరు మృతిచెందారు. వివరాలు.. ఆదిలాబాద్ జిల్లా కుంటాల మండలం వన్నాల్‌టాడ్ గ్రామానికి చెందిన మెగి రమేష్‌గౌడ్(30) బైక్‌పై వోల గ్రామంలోని తన స్నేహితుడి ఇంట్లో శుభకార్యానికి వెళ్లాడు. ఈ క్రమంలో శుక్రవారం అర్ధరాత్రి ఆందాపుర్ క్రాస్ రోడ్డు వద్ద బైక్ అదుపుతప్పి కిందపడ్డాడు. అతనికి 108 అంబులోన్స్ లో నిర్మల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు హైదరాబాద్ తలిస్తుండగా కామరెడ్డి సమీపంలో మృతి చెందాడు. భార్య సుజాత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎసై్స మోహన్‌బాబు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *