Tuesday, 3 November 2026

పెళ్లి చేసుకుంటానని యువతిని మోసగించిన వ్యక్తిపై కేసు

  • jyo ఎల్లారెడ్డి టౌన్‌: ప్రేమిస్తున్నానని వెంటపడుతూ పెళ్లి చేసుకుంటానని నమ్మబలికిన ఓ కామాంధుడు ఓ యువతిని గర్భవతిని చేసి పెళ్లికి ససేమీరా అన్నాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ అనిల్‌కుమార్‌ కథనం ప్రకారం.. నిజామాబాద్ జిల్లా కొత్తపల్లి గ్రామానికి చెందిన బెస్త సుజాత (22) పదో తరగతి ఫెయి‌ల్‌ కావడంతో ఎల్లారెడ్డి పట్టణంలో కుట్టు మిషన్‌ నేర్చుకుంటుంది. ఈ క్రమంలో మండలంలోని గండిమాసానిపేట్‌కు చెందిన మంగళి ప్రవీణ్‌ అనే వ్యక్తి సుజాతను గమనించాడు. అనంతరం ఆమెను ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. పెళ్లి చేసుకుంటానని గర్భవతిని చేశాడు. సుజాత జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పుకొని రోదించింది. సుజాత తల్లిదండ్రులు తన బిడ్డకు న్యాయం చేయాలంటూ గ్రామపెద్దలను ఆశ్రయించారు. గ్రామ పెద్దలు ప్రవీణ్‌ను పిలిపించి మాట్లాడేందుకు ప్రయత్నించగా అతడు ఓ మాజీ రౌడీషీటరును తీసుకొని పంచాయితీకి హాజరయ్యాడు. పంచాయితీలో మాజీ రౌడీషీటరు పవార్‌ సంతోష్‌ గ్రామ పెద్దలను బెదిరించడంతో పాటు ఈ గర్భానికి ప్రవీణ్‌ కారకుడనేందుకు మీ దగ్గర ఏవైన ఆధారాలు ఉన్నాయా అంటూ.. అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ప్రవీణ్ కూడా అతనికి వంత పాడుతూ ఆమె గర్భానికి తానే కారణమని రుజువేంటని నిలదీశాడు. దీంతో తనకు పంచాయితీలో న్యాయం జరగదంటూ ప్రజావాణిలో కలెక్టర్‌తో విన్నవించుకుంది. ఈ మేరకు కలెక్టర్‌ ఎస్పీతో మాట్లాడి సుజాతకు న్యాయం చేయాలని కోరడంతో పోలీసు శాఖ కదిలింది. ఎట్టకేలకు అత్యాచారం, మోసం కింద ప్రవీణ్‌పై కేసులు నమోదు చేశారు. అదే విధంగా మోసం, బెదిరింపులు, అవమాన పర్చారనే సెక్షన్ల కింద మాజీ రౌడీషీటరు పవార్‌ సంతోష్‌పై కేసులు నమోదయ్యాయి. వీరిని అదుపులోకి తీసుకున్నామని బుధవారం కోర్టులో హాజరుపర్చనున్నట్లు సీఐ వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *