ధర్మపురి (జనం సాక్షి)జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం వెల్గొండ లో ఇటీవల షార్ట్ సర్కూట్ తో పెసరి అశోక్ కు చెందిన ఇల్లు పూర్తిగా దగ్ధం కాగా కుటుంబ సభ్యులు నిరాశ్ర యులయ్యారువిషయం తెలుసుకున్న మంత్రి కొప్పుల ఈశ్వర్, బాధితుల వద్దకు వెళ్లి ఓదార్చారుఆదర్య పడవద్దని వారిలో ఆత్మ స్థైర్యం నింపారు.. తక్షణ సహాయం కింద 30 వేల రూ. అందించారు.2 నెలలకు కావాల్సిన వంట సామగ్రి, బియ్యంను, కుటుంబ సభ్యులకు బట్టలు అందించారు.ప్రభుత్వ పక్షాన అన్ని విధాలుగా అధికుంటామన్నారు. బాధితులకు ఇల్లు మంజూరు కు హామీ ఇచ్చారు.
అంతకుముందు వెల్గొండ ఎక్స్ రోడ్ వద్ద, ద్విచక్రవాహనం ను కార్ ఢీకొన్న సంఘటనలో రెంటం రాజమల్లు అనే వ్యక్తి కి తీవ్రగాయాలు అయి కింద పడి ఉండగా అదే మార్గం
లో వెళ్తున్న మంత్రి ఈశ్వర్ బాధితున్ని పరమార్శించి 2వేలు రూ. ఖర్చుల నిమిత్తం ఇచ్చి తన
ఎస్కార్ట్ వాహనం లో ఆసుపత్రికి తరలించి మానవత్వాన్ని చాటారు..




