Wednesday, 4 November 2026

వేణుమాధవ్ పుట్టినరోజు వేడుకలు

 

 

 

 

 

వరంగల్ ఈస్ట్ మే 22 (జనం సాక్షి)చాత్తాద శ్రీ వైష్ణవ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అశ్వాపురం వేణుమాధవ్ పుట్టినరోజు సందర్భంగా రంగసాయిపేట సాయి నగర్ కాలనీలోని జిల్లా అధ్యక్షులు రామానుజన్ జగదీశ్వర్ స్వామి స్వగృహంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు రామానుజన్ జగదీశ్వర స్వామి మాట్లాడుతూ సేవలు చాలా అద్భుతమని ఆయన సంఘానికి చేస్తున్న సేవ వెలకట్టలేని నాని మరియు వారి కుటుంబం నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలతో ఉండాలని కోరారు వరంగల్ జోన్ మహిళా ఉపాధ్యక్షురాలు హరిత జ్యోతి వేణుగోపాల్ మాట్లాడుతూ ఆయన మన సంఘానికి మరింత సేవ చేసే భాగ్యం మనకు దక్కడం చాలా అదృష్టమన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వరయోగుల శ్రీనివాస స్వామి సహాయ కార్యదర్శి దాస్యం రవికుమార్ కోశాధికారి తిరుక్కోవల్లురి గిరిధర్ స్వామి సిటీ ఉపాధ్యక్షులు జగన్నాథం వేణు స్వామి జిల్లా సాంప్రదాయ కార్యదర్శి దాస్యం నారాయణస్వామి వరయోగుల వేణుమాధవ్ వరయోగుల వెంకటేశ్వర స్వామి దాసరతి శ్రీనివాస స్వామి జగన్నాథం వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు