హైదరాబాద్ : మల్కాజ్‌గిరి ఉప్పర్‌గూడలోని పేకాట గృహంపై పోలీసులు దాడి చేసి 20మంది పేకాటరాయుళ్లను అరెస్టు చేశారు నెల రోజులుగా ఇక్కడ పేకాడుతున్నట్లు విశ్వసనీయ సమాచారంతో మల్కాజ్‌గిరి ఏసీపీ అధ్వర్యంలో పోలీసులు వారిని ఈ తెల్లవారుజామున అరెస్టు చేశారు పేకాడుతున్న20 మందితో పాటు 18 సెల్‌ఫోన్లు 2కార్లు మోటర్ సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు సుమారు 20లక్షల నగదు ఉన్నట్లు తెలిసింది స్థానిక ఎమ్మెల్యే అనుచరులే ఈపేకాట గృహాన్ని నిర్వహిస్తున్నట్లు పలుపురు ఆరోపిస్తున్నారు.




