Tuesday, 3 November 2026

పేదప్రజలకు ‘హృదయ స్పందన’

కరీంనగర్‌, నవంబర్‌ 3: పేద కుంటుంబాల పిల్లలకు గుండె ఆపరేషన్‌, ఇతర ప్రాణాత్మకమైన వ్యాధుల నుండి రక్షించుటకు ఏర్పాటు చేసిన ‘హృదయ స్పందన’ కార్యక్రమానికి జిల్లా పౌర సరఫరాల సంస్థ సిబ్బంది ఒక రోజు జీతం 17,868 రూపాయలు అందించుట అభినందనీయమని జిల్లా కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌ అన్నారు. శనివారం కలెక్టరేటులో సివిల్‌ సప్లయి కార్పోరేషన్‌ డి.ఎం. చంద్రప్రకాశ్‌ విధుల్లో చేరు  సందర్భంగా సిబ్బందితో కలిసి ఒక రోజు జీతం చెక్‌ను కలెక్టర్‌రు అందజేశారు. అలాగే భీందేవరపల్లి తహశీల్దార్‌ కార్యాలయం సిబ్బంది ఒకరోజు వేతనం 7,500 రూపాయల చెక్కును రెవెన్యూ సెంట్రల్‌ అసోసియేషన్‌ సెక్రటరీ ముస్లీయోద్దీన్‌, సిబ్బందితో కలిసి కలెక్టర్‌కు చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వీరిని ఆదర్శంగా తీసుకొని హృదయ స్పందన కార్యక్రమాన్ని జిల్లాలో పెద్ద ఎత్తున అమలు చేసేందుకు, పేదప్రజల జీవితాల్లో వెలుగులు నింపుటకు ముందుకు రావాలని కోరారు. జిల్లాలోని అన్ని అసోసియేషన్లు, పారిశ్రామికవేత్తలు, ప్రైవేటు విద్యాసంస్థలు ముందుకు రావాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *