– మండల ఉపాధ్యక్షుడు కళ్లెపు సతీష్ కుమార్ గౌడ్-1,50 వేల రూపాయల ఎల్ఓసి చెక్కు అందజేత
డోర్నకల్ మార్చి /6/జనం సాక్షి న్యూస్:తెలంగాణ రాష్ట్రంలోని అనారోగ్య పేదలకు అభయ హస్తంగా సీఎం సహాయనిధి నిలుస్తుందని డోర్నకల్ బిఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు కల్లెపు సతీష్ కుమార్ గౌడ్ అన్నారు.అనారోగ్యాతో బాధపడుతున్న కురవి మండలం మోదుగుల గూడెం గ్రామానికి చెందిన అయిలి పద్మ కు లక్ష 50 వేల రూపాయల ఎల్.ఓ.సి చెక్కును డోర్నకల్ మండలం గొల్లచర్ల గ్రామంలో సోమవారం మండల ఉపాధ్యక్షుడు కళ్లెపు సతీష్ కుమార్ గౌడ్ లబ్ధిదారికి అందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతూ కార్పొరేట్ హాస్పిటల్ లో వైద్య చికిత్సలు చేయుంచుకోలేని కోసం మానుకోట పార్లమెంట్ సభ్యురాలు మాలోత్ కవిత, డోర్నకల్ శాసనసభ్యుడు డిఎస్ రెడ్యా నాయక్ సహాయ సహకారంతో నియోజవర్గంలో అనేక మందికి సీఎం సహాయనిధి కింద ఎల్.వో.సి ద్వారా ముందస్తుగా చెక్కలను అందిస్తూ పేదలకు ఆర్థిక భరోసా కల్పిస్తుందన్నారు. అదేవిధంగా లబ్ధిదారురాలు ఐయిలి పద్మ మాట్లాడుతూ మండల ఉపాధ్యక్షులు కళ్లెపు సతీష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే రెడ్యా నాయక్, ఎంపీ కవిత కు కృతజ్ఞతలు తెలుపుతూ బిఆర్ఎస్ పార్టీకి రుణపడి ఉంటామని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో భూక్యా శ్రీను,భరోత్ రాము తదితరులు పాల్గొన్నారు.




