:శామీర్ పేట్, జనం సాక్షి :శామీర్పేట శ్రీ మల్లిఖార్జున స్వామి కళ్యాణోత్సవం, జాతర ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. సోమవారం శామీర్పేట పెద్దగొల్ల యాదవ సంఘం ఆధ్వర్యంలో స్వామి వారి కళ్యాణోత్సవం, అగ్నిగుండాలు, బోనాలు చెల్లించుట కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మంత్రి మల్లారెడ్డి, కాంగ్రెస్ జడ్పి ఫ్లోర్ లీడర్ హరివర్ధన్ రెడ్డి,బి ఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షులు సుదర్శన్,ఎంపీపీ ఎల్లుభాయి బాబు, జడ్పీటీసీ అనితా, సొసైటీ చైర్మన్ మధుకర్ రెడ్డిలను కమిటీ నాయకులు శాలువాతో సన్మానించారు.అనంతరం మహిళలు స్వామి వారికి బోనాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు. ఆలయం వద్ద భక్తులకు యాదవ్ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలోశామీర్పేట పెద్దగొల్ల యాదవ సంఘం చైర్మన్ మ్యాకల కుమార్ యాదవ్, కోశాధికారి వర్ల రమేష్ ఉప సర్పంచ్, ఎఫ్ఎసిసిఎస్ వైస్ చైర్మన్ మ్యాకల ఐలయ్య యాదవ్,నాయకులు మాజీ సర్పంచ్ కిశోర్ యాదవ్,మహేందర్ యాదవ్, వై ఎస్ గౌడ్, కృష్ణారెడ్డి,అఫ్జల్ ఖాన్,పెద్ద గొల్ల సత్తయ్య, బండారి రాజు, చీర్ల వెంకటేష్, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో యాదవ కులస్తులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామి కళ్యాణోత్సవాన్ని తిలకించి స్వామివారిని దర్శించుకున్నారు.స్వామివారి జాతరోత్సవంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు విలాసాగరం సుదర్శన్,పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మంగళవారం మంద పోచమ్మ, సౌడమ్మ, ఎల్లమ్మ తల్లి అమ్మవార్ల కళ్యాణోత్సవం నిర్వహించనున్నట్లు పెద్దగొల్లకమిటి సభ్యులు తెలిపారు.6ఎస్పీటీ -1:శ్రీ మల్లిఖార్జున స్వామిఆలయంలో ప్రత్యేక పూజలో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి.




