బిచ్కుంద జూన్ 08 (జనంసాక్షి) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని బిచ్కుంద మండలంలో గల కందర్ పల్లి గ్రామంలో గురువారం నాడు బిజెపి జిల్లా అధ్యక్షురాలు జుక్కల్ మాజీ శాసనసభ్యురాలు అరుణ తార ఘర్ ఘర్ అభియాన్ ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు సేవ చేయడం వదిలేసి కేవలం తమ భవిష్యత్తు చక్కదిద్దడానికి పని చేస్తోందని దుయ్యబట్టారు. నియోజకవర్గ పరిధిలో డబుల్ బెడ్రూం కట్టుకోండి అని చెప్పి బిల్లులు ఏవని జనం ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీ తొమ్మిది సంవత్సరాల సేవా మరియు పరిపాలన ప్రజలకు వివరిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలు కూడా ప్రజలకు వివరిస్తూ ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిచ్కుంద మండల అధ్యక్షుడు కిష్టారెడ్డి, శ్రీధర్ పంతులు, శివాజీ పటేల్, జాదవ్ పండరి నాయక్, రాజు పటేల్ , శ్రీకాంత్, సంతోష్, మారుతి, హన్మంత్, నవీన్, ధర్మా, పీరాజీ మరియు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
పేదలకు ఆదుకోని రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లేవి? మాజీ ఎమ్మెల్యే తార




